తెలంగాణ

telangana

ETV Bharat / state

71,136 ఎన్యుమరేటర్లతో జనాభా లెక్కల సేకరణ - జనాభా లెక్కల సేకరణపై హైదరాబాద్​లో సీఎస్ సమీక్ష

2021 జాతీయ జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన ఏర్పాట్లు, శిక్షణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమీక్షించారు. రాష్ట్రంలో 71,136 ఎన్యుమరేటర్ల ద్వారా వివరాలు సేకరిస్తామన్నారు.

71, 136 ఎన్యుమరేటర్లతో జనాభా లెక్కల సేకరణ
71, 136 ఎన్యుమరేటర్లతో జనాభా లెక్కల సేకరణ

By

Published : Dec 3, 2019, 5:26 AM IST

Updated : Dec 3, 2019, 9:32 AM IST

71,136 ఎన్యుమరేటర్లతో జనాభా లెక్కల సేకరణ
జనాభా లెక్కల కోసం జనవరి కల్లా రెండు వేల మంది క్షేత్రస్థాయి శిక్షకులకు శిక్షణ పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. 2021 జాతీయ జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన ఏర్పాట్లు, శిక్షణ ఇతర అంశాలపై హైదరాబాద్​లో సీఎస్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

65 మందికి శిక్షకులకు శిక్షణ

రాష్ట్రంలో 71,136 ఎన్యుమరేటర్ల ద్వారా జనాభా లెక్కలను సేకరిస్తామని సీఎస్ తెలిపారు. ఇందుకోసం 65 మంది ముఖ్య శిక్షకులకు మొదటి విడత శిక్షణ ముగిసిందన్నారు. రెండో విడత ఈ నెల 7 వరకు పూర్తవుతుందన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు క్షేత్రస్థాయి శిక్షకులు ఏప్రిల్​లో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

వివరాలన్నీ...

జనాభా లెక్కల్లో భాగంగా నివాసాల గుర్తింపు, గణన, జనాభా వివరాలతో పాటు జాతీయ జనాభా రిజిస్టర్​ను ఆధునికీకరిస్తామని సీఎస్ జోషి వెల్లడించారు. వ్యక్తుల వివరాలతో పాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, నివాస వివరాలు సేకరిస్తారన్నారు. మొబైల్ అప్లికేషన్, పేపర్ షెడ్యూలు ద్వారా జనాభా లెక్కల కోసం వివరాలు సేకరిస్తారని.. ఎన్యుమరేషన్ బ్లాకులుగా ఏర్పాటు చేసి అధికారులను నియమిస్తారని జోషి తెలిపారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సెన్సస్​ ఆపరేషన్స్​ డైరెక్టర్​ ఇలంబర్తి వివరించారు.

ఇవీ చూడండి : దిశ నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు

Last Updated : Dec 3, 2019, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details