సచివాలయంలో ఆహార భద్రతపై సీఎస్ జోషితో పుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్ రీటా టియోటియా సమీక్షించారు. రాష్ట్రంలో ఆహార భద్రతకు చేపడుతున్న కార్యక్రమాలపై సీఎస్ ఆమెకు వివరించారు. ఆహార భద్రత, సాంకేతికత వినియోగం, శిక్షణ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రాష్ట్ర అధికారులకు వివరించారు. ఆహార భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పోర్టల్ పనితీరు, ఆహార పదార్థాల్లో కల్తీ నిరోధం, అనుమతుల జారీ, తనిఖీలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించామని సీఎస్ తెలిపారు. పుడ్ బిజినెస్ ఆపరేటర్లను చైతన్యం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణాల్లోని రెస్టారెంట్లు, హోం కిచెన్, రోడ్లపై ఆహారపదార్థాల విక్రయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఆహార భద్రత విషయంలో తగిన ప్రణాళిక రూపొందించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను సీఎస్ జోషి ఆదేశించారు.
ఆహార భద్రతపై సచివాలయంలో సమీక్ష - ఆహార భద్రత
రాష్ట్రంలో ఆహార భద్రతపై ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో పుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ రీటా టియోటియా సమీక్షించారు. భద్రత తనిఖీలు, సాంకేతికత వినియోగం, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రాష్ట్ర అధికారులతో చర్చించారు. ఆహార భద్రతకు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ జోషి వివరించారు.
ఆహార భద్రతపై సచివాలయంలో సమీక్ష