తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నార్తుల ఆకలి తీరుస్తున్న క్రియా స్వచ్ఛంద సంస్థ

లాక్‌డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలను ఆదుకోవడానికి క్రియా స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. సంస్థ ఆధ్వర్యంలో అన్నార్తులకు భోజన ప్యాకెట్లు, నిత్యావసర సరకులు అందజేశారు.

criya ngo organization distributed food to poor people in Hyderabad city
అన్నార్తుల ఆకలి తీరుస్తున్న క్రియా స్వచ్ఛంద సంస్థ

By

Published : Apr 19, 2020, 8:24 PM IST

క్రియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నగరంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ... ప్రతిరోజు మూడు వేల మంది అన్నార్తులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు షేక్ నయీమ్ తెలిపారు.

సికింద్రాబాద్, కంటోన్మెంట్, దుండిగల్, జవహర్‌నగర్ ప్రాంతాలలో ఉన్న వలస కూలీలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. బీపీ, షుగర్, కిడ్నీ, చెవి, కంటి వంటి సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో మందులను సరఫరా చేస్తున్నారు.

లాక్‌డౌన్ కాలంలో పేద ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో తమ వంతు సహాయ సహకారాలు చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి:మారుతున్న జీవనశైలితో సామాజిక చైతన్యం స్థిరపడేనా?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details