క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల ఆగడాలు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘనటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ ఫాతిమా నగర్‌లో రవి అనే యువకుడు బెట్టింగ్ డబ్బులు కట్టలేక బలవర్మణానికి పాల్పడ్డాడు. రాజశేఖర్ అనే వ్యక్తి బెట్టింగ్ డబ్బుల కోసం తరుచూ వేధిస్తుండటం వల్ల ...తన తండ్రికి విషయం చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ డబ్బులు కట్టలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని మృతుడు తన సుసైడ్ నోట్‌లో రాసిపెట్టాడు. తమకు న్యాయం చేయాలని మృతుని తల్లిదండ్రులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు రాజశేఖర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు .
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి ఆగడాలకు విద్యార్థి బలి - Cricket betting
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల ఆగడాలు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘనటన...హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Cricket betting