ఇదీ చదవండి:
CREDAI: 'అనుమతుల్లేని ఆస్తుల విక్రయాల కట్టడికి క్రెడాయి, ట్రెడా చర్యలు' - telangana varthalu
Credai warns buyers: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అనధికారిక ఆస్తులు, అనుమతులు లేని ఆస్తుల విక్రయాలను నిలువరించేందుకు డెవలపర్స్ అసోసియేషన్లు ఏకమయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సర్క్యులర్ జారీ చేయించిన వివిధ సంఘాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నాయి. యూడీఎస్ పేరుతో జరుగుతున్నవిక్రయాల కారణంగా... స్థిరాస్తి రంగంపై చెడ్డపేరు వచ్చే ప్రమాదముందని క్రెడాయి, ట్రెడా అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డెవలపర్లు నష్టపోకుండా ఉండాలన్న యోచనతో అసోసియేషన్‌లన్నీ ఒకటై అనుమతులు లేని విక్రయాలపై దృష్టిసారించాయి. టీబీఎఫ్, టీడీఏ, ట్రెడా, క్రెడాయ్‌లతోపాటు నిర్మాణాలకు చెందిన ఇతర అసోసియేషన్లు యూడీఎస్, ఫ్రీ సేల్స్ పేర్లతో ఆస్తులను విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతోపాటు... ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి.
CREDAI: 'అనుమతుల్లేని ఆస్తుల విక్రయాల కట్టడికి క్రెడాయి, ట్రెడా చర్యలు'