హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు సీఎం కేసీఆర్‌కు ఒక గుణపాఠం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana on KCR) అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా నియంతృత్వంగా వ్యవహరించడం వల్లే ఈ విధమైన ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. కేసీఆర్.. పార్టీ లోపల, బయట నియంతృత్వ పోకడ వల్లే ఈటల రాజేందర్(CPI Narayana on KCR) గెలిచారు తప్పితే.. ఈ ఫలితం భాజపా సొంత బలం కాదని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ నియంతృత్వ పోకడ వల్లే ఈటల గెలిచారు తప్పితే.. ఇది భాజపా విజయం కాదు. హుజూరాబాద్ ఫలితాలు కేసీఆర్‌కు గుణపాఠం కావాలి. అన్ని పార్టీలు కలిసి ఐక్యంగా పోరాడితేనే తెరాస, భాజపాలను ఓడించడం సాధ్యం అవుతుంది. -నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి