కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేయడాన్ని... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభినందించారు. ఈ బిల్లుతో రైతులను దెబ్బకొట్టే ప్రమాదముందని ఆయన అభిప్రాయ పడ్డారు.
'కేంద్రం ప్రవేశం పెట్టే బిల్లులు రైతులను దెబ్బతీసేలా ఉన్నాయి' - కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామ వార్తలు
కేంద్రం ప్రవేశ పెట్టిన రైతు బిల్లు.. అన్నదాతలను దెబ్బకొట్టేలా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. దీనిని సీపీఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజనీమా చేయడాన్ని ఆయన సమర్థించారు.
'కేంద్రం ప్రవేశం పెట్టే బిల్లులు రైతులను దెబ్బతీసేలా ఉన్నాయి'
పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోండంటే రైతులు ఎక్కడికి వెళ్లి అమ్ముకోవాలని నారాయణ ప్రశ్నించారు. అలా చేస్తే... రైతు పండించిన వాటిని తీసుకెళ్లి నేరుగా మధ్య దళారులకు, కార్పొరేట్ రంగానికి అప్పగించడమే అవుతుందన్నారు. రైతులకు నష్టం చేకూర్చే బిల్లుకు తెదేపా, వైసీపీ ఎట్లా మద్దతు పలికాయో అర్థంకావడం లేదన్నారు. దుర్మార్గమైన బిల్లుకు మద్దతు తెలిపే వాళ్లు దుర్మార్గులే అని ఆయన విమర్శించారు.
ఇదీ చూడండి:హర్సిమ్రత్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం