మోదీ ప్రభుత్వం విధ్వంస చర్యలకు పాల్పడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సీఏఏ యాక్టును అమలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్ర వైఖరికి నిరసనగా 8న ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడించారు.
కేసీఆర్ ఎన్ఆర్సీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని నారాయణ ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ దోస్తులే అని.. వారు పరస్పరం ఒకరినొకరు పెంచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రానికి అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెలుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కేంద్రానికి తగినట్లే రాష్ట్ర ప్రభుత్వాలు మెలుగుతున్నాయి' - కేసీఆర్, జగన్ ఇద్దరూ దోస్తులే
మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా సీఏఏ యాక్టును అమలు చేస్తోందని... దీనిని సీపీఐ ఖండిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు.
కేంద్రానికి తగినట్లే రాష్ట్ర ప్రభుత్వాలు మెలుగుతున్నాయి'