కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జల వివాదంపై లేఖ రాయడం కలకలం రేపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. అందులో ప్రధానంగా ఆంద్రప్రదేశ్లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ల ప్రస్తావన... తెలంగాణలో కాళేశ్వరం మూడు టీఎంసీలు, దేవాదాయ ప్రాజెక్టు, రామప్ప నుంచి పాకాల వరకు లేక్ మళ్లింపు ఇలా ఆరు, ఏడు పథకాలకు సంబంధించి వాటిని ఆపేయాలని లేఖ రాశారని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇద్దరు సీఎం రాకపోవడం వల్ల వాయిదా పడుతూ వస్తోందన్నారు. నిజానికి తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని పేర్కొన్నారు.
దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది: చాడ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి లేఖ రాయడం కలకలం రేపుతోందని చాడ వెంకటరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవహార శైలీ వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు.
దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది: చాడ
నికర జలాలనే తెలంగాణ వినియోగించుకోలేకపోయిందని... ఇక మిగులు జలాలకు సంబంధించి ఎప్పుడు ఉపయోగించుకుంటామో తెలియదన్నారు. దెబ్బ మీద దెబ్బలాగా కేంద్ర మంత్రి లేఖ ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలీ వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్