భూ సమగ్ర సర్వే చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చించలేదన్నారు. దాదాపు 14 అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వాటి విషయంలో కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు.
రాష్ట్రంలో భూ సమగ్ర సర్వే చేపట్టాలి: చాడ వెంకట్‌రెడ్డి
ఇంచుఇంచుకు భూమి లెక్కలు రావాలంటే భూ సమగ్ర సర్వే చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ పరిధిలో 186 స్టక్చర్స్ మాయం అయ్యాయన్నారు. దొంగ ఎవరో దొర ఎవరో తెలియాలంటే సర్వే చేయాలని కోరారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్ణయించిన కొన్ని డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లానని.. వాటి విషయంలో కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు.
భూ సమగ్ర సర్వే చేపట్టాలి: చాడ వెంకట్‌రెడ్డి
సీపీఐ భూ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వేర్వేరుగా భూ చట్టాలు ఉండేవని ఆయన తెలిపారు. ఆ చట్టాల్లో ఉన్న అనేక లొసుగులు, లోపాలపై 15 లేఖలు రాసినట్లు చెప్పారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్ణయించిన కొన్ని డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించి.. కఠినంగా అమలు అయ్యే విధంగా చూడాలని కోరారు.
ఇదీ చూడండి :మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్
TAGGED:
భూ సమగ్ర సర్వేకు డిమాండ్