అక్రమాలకు గురైన మూసి పరివాహక ప్రాంతాలతో పాటు... కబ్జాలకు గురైన చెరువుల పరిరక్షణ కోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు నరసింహారావు, కూన సాంబశివరావు తదితరులతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ను కలిసి వినతి పత్రం అందించారు.
స్వలాభాల కోసం...
ఈ విషయంపై మేయర్ సానుకూలంగా స్పందించారని చాడ తెలిపారు. త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. నగరంలో మూసి పరివాహక ప్రాంతం, చెరువులు ఆక్రమణలకు గురికావడం వల్లనే... మొన్న కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైందని చాడ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తమ సొంత ఆస్తులను పెంచుకోవడం కోసం... రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి.. చెరువులు ఆక్రమించారంటూ ఆరోపించారు. తమ స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు.