రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని.. ప్రభుత్వం నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని కోరారు.
కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలి: చాడ - చాడ వెంకట్రెడ్డి తాజా వార్తలు
కరోనా నియంత్రణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలి: చాడ
మరోవైపు కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటే.. వారికి సక్రమంగా జీతాలు చెల్లించకపోవడం సరికాదని చాడ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ అంతకంతకూ పెరిగిపోతుందన్న ఆయన.. ప్రభుత్వం తక్షణమే వీటిపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచూడండి: ఇసుక మాఫియా వెనక ఎంత పెద్ద అండ ఉందో అర్థమవుతోంది: చాడ