పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు - cp
రంజాన్ మాసం చివరి శుక్రవారం... ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
ఇవాళ రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడం వల్ల ముస్లింలు పెద్ద ఎత్తున మసీదులకు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాతబస్తీ మక్కా మసీదులో వేల సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. వక్ఫ్‌బోర్డు, మైనార్టీ సంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాలిబండ, చార్మినార్, గుల్జార్‌హౌజ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.