తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షం పడితే... ఇవిగో ప్రత్యామ్నాయ మార్గాలు...

భాగ్యనగరం​లో చినుకు పడితే వాహనదారులు నరకం చూడాల్సిందే. రెండు రోజులు క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్​ స్తంభించిపోయింది. ముందస్తు చర్యలు చేపట్ట జీహెచ్​ఎంసీ విఫలమైంది. నగరంలో ట్రాఫిక్​ పరిస్థితిపై జీహెచ్​ఎంసీ కమిషనర్​తో సమీక్షించిన సైబరాబాద్​ సీపీ ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులకు సూచించారు. వర్షం వచ్చేటపుడు ఆ మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు.

ప్రత్యామ్నాయ మార్గాలు

By

Published : Jun 25, 2019, 5:29 PM IST

వర్షం పడేటప్పుడు ట్రాఫిక్​ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన సీపీ

హైదదాబాద్​ నగరంలోని ఐటీ కారిడార్​... నిత్యం వేలాదిగా జనం సంచరించే ప్రాంతం. ఇక్కడ చినుకు పడితే తలెత్తే ట్రాఫిక్​ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిందే. అలాంటి పరిస్థితి రాకుండా సైబరాబాద్​ కమిషనర్​ సజ్జనార్​ ప్రత్యామ్నాయ మార్గాలను నగరవాసులకు సూచించారు. జీహెచ్​ఎంసీ కమిషనర్​, సిబ్బందితో నగరంలో ట్రాఫిక్​ పరిస్థితిపై సమీక్షించారు. ప్రధానంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ఆ మార్గాల్లో కాకుండా వేరే మార్గాలను ఆన్వేషించారు. గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ వెళ్ళాల్సిన వారు బయోడైవర్సిటీ, ఖాజాగూడా, ఫిలింనగర్, కేబీఆర్ పార్క్ మీదుగా వెళ్లాలని సూచించారు. హైటెక్​ సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లాల్సిన వారు హైటెక్స్​, కొండాపూర్, అల్విన్ చౌరస్తా మీదుగా వెళ్లాలని అన్నారు. దీనికి సంబంధించిన రూట్​ మ్యాప్​ను విడుదల చేసిన సీపీ, ట్రాఫిక్​లో ఇరుక్కోకుండా ఈ మార్గాలను ఎంచుకోవాలని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details