తెలంగాణ

telangana

ETV Bharat / state

సీపీ ఆకస్మిక పర్యటన... నేరస్థుల కదలికలపై ఆరా - సీపీ అంజనీ కుమార్​

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో పోలీస్​ కమిషనర్​ అంజనీకుమార్​ ఆకస్మికంగా పర్యటించారు. పాత నేరస్థుల ఇళ్లకు వెళ్లి... వారి కదలికలపై ఆరా తీశారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో గస్తీ పోలీసుల పాత్ర చాలా కీలకమని సీపీ తెలిపారు.

సీపీ ఆకస్మిక పర్యటన

By

Published : Aug 23, 2019, 2:03 PM IST

సీపీ ఆకస్మిక పర్యటన... నేరస్థుల కదలికలపై ఆరా

హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నారాయణగూడ పోలీస్​స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. తన వాహనంలో నారాయణగూడకు చేరుకున్న అంజనీకుమార్ అనంతరం పోలీస్ గస్తీ వాహనంలో ప్రధాన రహదారులతో పాటు... విఠల్​వాడీ, హైదర్​గూడ, నారాయణగూడ, అవంతినగర్ కాలనీల్లో పర్యటించారు. స్థానికంగా ఉండే కొంతమంది రౌడీషీటర్లు, పాత నేరస్థుల ఇళ్లకు వెళ్లి వారి కదలికలపై ఆరా తీశారు.

నిరంతరం నిఘా ఉండాలి

దొంగలు, పాత నేరగాళ్ల కదలికలపై స్థానిక పోలీసులు ఎల్లప్పుడూ నిఘా ఉంచాలని సీపీ సూచించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో గస్తీ పోలీసుల పాత్ర ఎంతో కీలకమని సీపీ తెలిపారు. ప్రజలు పోలీసుల నుంచి ఎలాంటి సేవలు ఆశిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి కాలనీల్లో పర్యటించినట్లు అంజనీ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి : పెట్రోల్​ బంక్​లో ఎగిసిపడిన మంటలు... ఇద్దరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details