తెలంగాణ

telangana

ETV Bharat / state

లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా సైబరాబాద్​లో లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన సీపీ... పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సైబరాబాద్​ పరిధిలో 7వేల సిబ్బంది ఉన్నట్లు చెప్పారు.

cp sajjanar talk about ghmc elections results 2020 security
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

By

Published : Dec 4, 2020, 10:17 AM IST

Updated : Dec 4, 2020, 10:26 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి కేంద్రం వద్ద ఓ సీనియర్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని వెల్లడించారు.

సైబరాబాద్​లో 7వేల భద్రత సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రాల సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వివరించారు. విజేతలు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై, బాణాసంచా, బ్యాండ్​మేలాలపై నిషేధం విధించామన్నారు. గెలుపొందిన అభ్యర్థులు, పార్టీలు 48 గంటల తర్వాతే ర్యాలీలు నిర్వహించుకోవాలని నిబంధన పెట్టినట్లు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. అనంతరం కూకట్​పల్లి సర్కిల్ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జోనల్ కమిషనర్ మమతతో కలిసి పరిశీలించారు.

లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

ఇదీ చూడండి:కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Last Updated : Dec 4, 2020, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details