తెలంగాణ

telangana

ETV Bharat / state

రాచకొండ పరిధిలో ఉచిత క్యాబ్​ సేవలు ప్రారంభం - Telangana News Updates

రాచకొండ పరిధిలో ఉచిత క్యాబ్​ సేవలను సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. 24/7 ఈ సేవలు అందుబాటులో ఉంటాయని సీపీ తెలిపారు. ఉపయోగించుకోవడానికి రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9490617234 సంప్రదించాలని తెలిపారు.

CP Mahesh Bhagwat launched free cab services in Rachakonda
CP Mahesh Bhagwat launched free cab services in Rachakonda

By

Published : Apr 24, 2021, 5:06 PM IST

వృద్దులకు, గర్భిణి మహిళలకు, ఇతర మెడికల్ ఎమర్జెన్సీ అవసరాలకు అందుబాటులో ఉండేలా ఉచిత క్యాబ్​ సేవలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ ప్రారంభించారు. నేరెడ్​మెట్ రాచకొండ పోలీసు కమిషనర్​ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎలైట్​ మహేంద్ర లాజిస్టిక్​ ఆధ్వర్యంలో నూతనంగా ఈరోజు 4 ఉచిత క్యాబ్​ సేవలను ప్రారంభించారు.

24/7 ఈ సేవలు అందుబాటులో ఉంటాయని సీపీ తెలిపారు. అవసరం ఉన్నవారు ఉపయోగించుకోవడానికి రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9490617234 సంప్రదించాలని సీపీ మహేష్ భగవత్ కోరారు.

ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details