తెలంగాణ

telangana

ETV Bharat / state

cp mahesh bhagwat: రక్తదానం చేద్దాం.. ప్రాణాన్ని కాపాడుదాం

ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మేడ్చల్​ జిల్లా నాగారంలో రక్తదాన శిబిరాన్ని(Blood donate camp) పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ రక్తదాన శిబిరం రాచకొండ సీపీ(Rachakonda cp) ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేశారు.

cp mahesh bhagwat
cp mahesh bhagwat

By

Published : Jun 14, 2021, 2:35 PM IST

తలసేమియా బాధితులకు రక్తం(Blood) చాలా అవసరమని... కానీ కొవిడ్(Covid-19) వేళ రక్తదానానికి ఎవరూ ముందుకు రావట్లేదని... రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ (mahesh bhagwat) అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దానం(donate) చేసినవారు దైవంతో సమానమని అన్నారు.

ప్రపంచ రక్తదాన దినోత్సవం(world blood donors day) సందర్భంగా రాచకొండ పోలీస్, చుక్కల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మేడ్చల్‌ జిల్లా నాగారంలో శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ మహేశ్‌ భగవత్‌... అనంతరం రక్తం దానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికీ సీపీ ధన్యవాదాలు తెలిపారు.

cp mahesh bhagwat: రక్తదానం చేద్దాం.. ప్రాణాన్ని కాపాడుదాం

ABOUT THE AUTHOR

...view details