తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో 70 మంది విధుల్లో చేరారు: సీపీ అంజనీకుమార్​ - tsrtc strike update news

హైదరాబాద్​లో 70 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారని... మరో 35 మంది విధులకు హాజరవుతారని సీపీ అంజనీకుమార్​ తెలిపారు.

70 మంది విధుల్లో చేరారు: సీపీ అంజనీకుమార్​

By

Published : Nov 5, 2019, 6:33 PM IST

Updated : Nov 5, 2019, 11:45 PM IST

ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు అర్ధరాత్రితో ముగియనుంది. హైదరాబాద్‌లో 70 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారని సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. మరో 35 మంది విధులకు హాజరవుతారని ఆయన తెలిపారు. హాజరైన వారి విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. సమ్మె వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ... విధుల్లోకి నిర్భయంగా చేరాలని ఆయన కార్మికులను కోరారు.

హైదరాబాద్​లో 70 మంది విధుల్లో చేరారు: సీపీ అంజనీకుమార్​
Last Updated : Nov 5, 2019, 11:45 PM IST

ABOUT THE AUTHOR

...view details