పోలీసులంటే కేవలం నేరాల నియంత్రణలోనే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో కూడా ముందున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టంచేశారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు వారితో అనుసంధాన కార్యక్రమాన్ని కార్ఖానా పోలీసుల ఆధ్వర్యంలో కేజేఆర్ గార్డెన్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీపీ అంజనీ కుమార్ హాజరై శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు.
పోలీసులు, ప్రజల సమన్వయం చాలా ముఖ్యం: సీపీ అంజనీకుమార్ - hyderabad
ప్రజలతో మమేకం అయ్యేందుకు హైదరాబాద్ కార్ఖానాలో పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ... నిరుద్యోగులకు పోలీసు శాఖ తరఫున వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
పోలీసులు, ప్రజల సమన్వయం చాలా ముఖ్యం: సీపీ అంజనీకుమార్
నిరుద్యోగులకు పోలీసుశాఖ తరపున వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతనంగా అనేక రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని అన్నారు. సమాజంలో శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసులు, ప్రజల సమన్వయం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రజల సహకారం ఉంటే నేరాలు తగ్గుతాయని వెల్లడించారు. అమరావతి నగర్లో ప్రజల సౌకర్యార్థం 50 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 'విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి'