ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా గంగవరం మండలం గాంధీనగర్లో ఏనుగు దాడిలో ఓ ఆవు వెన్నుపూస విరిగి తీవ్రంగా గాయపడినా, దూడ ఆకలి తీర్చేందుకు పడుతున్న ఆరాటం చూస్తే కన్నీళ్లు ఆగవు. ఏనుగుల దాడికి 11 రోజుల ముందే దూడను ప్రసవించింది. వెన్నుపూస విరిగి సరైన మేత లేక, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆకలితో దూడ పొదుగు వద్దకు వస్తే ఒంట్లో శక్తినంతా పాలుగా మార్చి ఆకలి తీరుస్తోంది ఈ గోమాత. తన తల్లి బాధ దూడకు అర్థమైందో ఏమో తల్లిని వదిలి ఎటూ వెళ్లకుండా దీనంగా చూస్తూ గడుపుతోంది.
బిడ్డ ఆకలి తీర్చాలని ఓ తల్లి ఆరాటం... - బిడ్డ ఆకలి తీర్చాలని ఓ తల్లి ఆరాటం
అమ్మకు ఎంతకష్టం వచ్చినా బిడ్డకు ఆ కష్టం తెలయనివ్వదు. ఈ మాటను అక్షరాలా నిజం చేసిందో గోమాత. ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడినా, బాధను పంటి బిగువునే భరిస్తూ దూడకు పాలిచ్చిందా ఆవు.
బిడ్డ ఆకలి తీర్చాలని ఓ తల్లి ఆరాటం....