హైదరాబాద్ మియాపూర్ వినాయకనగర్‌లోని పేదలకు స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్థానిక విండర్స్ ప్లాజా అపార్ట్మెంట్ వాసుల సహకారంతో వలస కార్మికులకు, నిరుపేదలకు కూరగాయలు, బియ్యం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.
మియాపూర్‌లో పేదలకు నిత్యావసరాలు పంపిణీ - మియాపూర్‌లో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కార్పొరేటర్
లాక్డౌన్ సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు పలువురు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. మియాపూర్ వినాయకనగర్‌లో స్థానిక మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు.
మియాపూర్‌లో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
ప్రతి ఒక్కరు మానవత్వంతో ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కోరారు. కార్యక్రమంలో తెరాస నాయకులు తిరుపతి రెడ్డి, గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ప్రతి రోజూ 100 గ్రాముల పండ్లు తప్పక తినాలి