హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఖాజానగర్ కాలనీ క్వారంటైన్ ప్రాంతంలో ఉన్న 150 కుటుంబాలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఖాజానగర్‌లో కరోనా పాజిటివ్ రావటం వల్ల బాధితుని నివాస పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులు క్వారంటైన్ ప్రాంతంగా ఏర్పాటు చేశారు.
క్వారంటైన్ కాలనీకీ నేనున్నానంటోన్న కార్పొరేటర్ - తెలంగాణలో కరోనా కేసులు
కరోనా పాజిటివ్ రావటం వల్ల హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ కాలనీలోని 150 మంది కుటుంబాలను అధికారులు హోం క్వారంటైన్ చేశారు. వారందరికీ నిత్యావసర సరుకులను క్వారంటైన్ ఉన్నన్ని రోజులు అందిస్తానని హామీ ఇచ్చాడు ఆ కాలనీ కార్పొరేటర్.
క్వారంటైన్ కాలనీకీ నేనున్నానంటోన్న కార్పోరేటర్
కాలనీలోని 150 కుటుంబాలను హోం క్వారైంటైన్లో ఉంచారు. వారందరికీ నిత్యావసర వస్తువులను జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో వెంకటేశ్‌గౌడ్ అందజేశారు. కాలనీకి తాను అండగా ఉంటానని... క్వారంటైన్ ఉన్నన్ని రోజులు నిత్యావసర వస్తువులు అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:-లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం
Last Updated : Apr 18, 2020, 10:22 PM IST