గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకూ.. వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా పరీక్షల సంఖ్య పెంచడం.. ప్రజలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా తిరగడం వైరస్ ఉద్ధృతికి కారణంగా భావిస్తున్నారు.
వైద్యుడు మృతి..
రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారిన పడి తొలి డాక్టర్ మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజుల కిందట జ్వరంతో కిమ్స్ ఆసుపత్రిలో నగరానికి చెందిన ఓ వైద్యుడు వచ్చారు. అనుమానంతో కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తెలింది. ఇవాళ చికిత్స పొందుతూ... ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
రాజాసింగ్‌కు నెగిటివ్..
కరోనా పరీక్షలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నెగిటివ్ వచ్చింది. తన గన్‌మెన్‌కు పాజిటివ్ నిర్ధరణ కాగా... ఎమ్మెల్యే పరీక్ష చేయించుకున్నారు. చర్లపల్లి డివిజన్లో పనిచేస్తున్న ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులకు కరోనా సోకింది. యూసుఫ్‌గూడ సర్కిల్-19 పరిధిలో 22 మంది వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఒక్క మధురానగర్ కాలనీలోనే ఐదుగురికి వైరస్ సోకిందని పేర్కొన్నారు. అమీర్‌పేట్ కార్పొరేటర్ శేషు కుమారికి కరోనా నిర్ధరణ అయింది. ఆమె కుటుంబ సభ్యుల్లో మరో 6 గురికి మహమ్మారి సోకింది.