జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు - జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు
12:39 June 12
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు వైద్యులు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్న మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో... బొంతు రామ్మోహన్ నమూనాలు తీసుకున్నారు.
గతంలో మేయర్ టీ తాగిన హోటల్లో మాస్టర్‌కు కరోనా రావడంతో... 10 రోజుల క్రితం పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. మేయర్ పేషిలో పనిచేసే వ్యక్తికి కూడా కరోనా సోకడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇవాళ నిర్వహించిన పరీక్షల రిపోర్ట్ సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది.