తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కారణంగా షెడ్డులకే పరిమితమైన ఎంఎంటీఎస్​ రైళ్లు

కరోనా మహమ్మారి కారణంగా హైదరాబాద్​లో ప్రజారవాణా స్తంభించిపోయింది. జంట‌న‌గ‌రాల్లో అత్యంత కీల‌క‌మైన ప్రజా ర‌వాణా వ్యవ‌స్థ ఎంఎంటీస్​ రైళ్లు... 3 నెల‌ల నుంచి షెడ్డుల‌కే పరిమితమయయ్యాయి. దీర్ఘకాలం ఎంఎంటీఎస్ రైళ్లు... షెడ్డులకే పరిమితం కావటం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Corona virus effect on MMTS trains in Hyderabad
కరోనా కారణంగా షెడ్డులకే పరిమితమైన ఎంఎంటీఎస్​ రైళ్లు

By

Published : Jul 10, 2020, 4:30 AM IST

జీహెచ్​ఎంసీ పరిధి, శివారులో... కరోనా రోజురోజుకు విజృంభిస్తుండడం వల్ల ప్రజా ర‌వాణా వ్యవ‌స్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంలేదు. జంట‌న‌గ‌రాల్లో అత్యంత కీల‌క‌మైన ప్రజా ర‌వాణా వ్యవ‌స్థ ఎంఎంటీస్​ రైళ్లు... 3 నెల‌ల నుంచి షెడ్డుల‌కే పరిమితమయయ్యాయి. ఆగస్టు 9... 2003లో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసులు.. ఇప్పటి వరకు షెడ్డుకు పరిమితమైన దాఖలాలేవు. 50 కిలోమీటర్ల పరిధిలో 29 స్టేష‌న్ల గుండా... నిత్యం 121 సర్వీసులు నడుస్తూ ఉండేవి. దీర్ఘకాలం ఎంఎంటీఎస్ రైళ్లు... షెడ్డులకే పరిమితం కావటం వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని రెండు రోజులకు ఒకసారి... సర్వీసింగ్‌ చేయాల్సి ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణకు సంబంధించి... ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్‌ మరిన్ని వివరాలను అందిస్తారు.

షెడ్డులకే పరిమితమైన ఎంఎంటీఎస్​ రైళ్లు

ABOUT THE AUTHOR

...view details