రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమీక్షలోఅధికారులు వెల్లడించారు. బుధవారం కరోనాతో ముగ్గురు మృతిచెందినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 127కు కరోనా కేసులు పెరిగాయి. ఇప్పటివరకు కరోనాతో 9 మంది మృతి చెందారు. చనిపోయిన ముగ్గురు కూడా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిగానే తేలింది. గతంలో మరణించిన వారిలోనూ ఎక్కువగా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే.
రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురి మృతి.. ఒక్కరోజే 30 కొత్త కేసులు
తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ పీడితుల సంఖ్య 127కు చేరుకుంది. బుధవారం కొవిడ్-19తో హైదరాబాద్ గాంధీలో ఇద్దరు, యశోద ఆస్పత్రిలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురు కూడా దిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిగా గుర్తించారు. ఇప్పటివరకు తెలంగాణలో ఈ మహమ్మారి బారినపడి 9 మంది చనిపోయారు.
మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు. అలాంటి వారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళన కరంగా లేదు. ఎవరూ చనిపోలేదు. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతన్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఇదీ చూడండి:ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను ఏ విధంగా వాడుతున్నారు: హైకోర్టు