హైదరాబాద్ మహానగరంలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. అంబర్‌పేట నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 600 కేసులు నమోదయ్యాయి. అంబర్‌పేట డివిజన్ పరిధిలోని 275 మంది వైరస్ బారినపడ్డారు. పోలీస్‌హెడ్ క్వార్టర్స్ మొదలుకొని పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, చెన్నరెడ్డి నగర్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. మంగళవారం కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూసుఫ్‌గూడ సర్కిల్-19 పరిధిలో 9 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. శంషాబాద్‌లో ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. బాధిత కుటుంబ సభ్యులందరిని హోం క్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 26 మందికి కరోన పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజలే స్వచ్ఛందంగా...
కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరగడం వల్ల.... జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్నిచోట్ల ప్రజలే స్వచ్ఛందంగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ, మారేడుపల్లి, కార్ఖానా, బోయినపల్లి, వాసవినగర్, అల్వాల్ సహా ఇతర ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కాలనీవాసులు కంటైన్మెంట్గా మార్చుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మల్కాజిగిరి, కుషాయిగూడ, నాగారం, చిర్యాల, కీసరలో ఇళ్ల ముందు బారికేడ్లు ఏర్పాటచేసి అధికారులు కట్టడి చర్యలు చేపట్టారు. ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదిగూడ నగర పాలక సంస్థలతో పాటు... ఘట్ కేసర్, పోచారం పురపాలక సంఘం పరిధిలోనికాలనీల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.