తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా అప్​డేట్స్: తెలంగాణలో కోవిడ్​పై ఇవాళ ఏం జరిగిందంటే? - CORONA NEWS IN TELANGANA

రాష్ట్రంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఈటీవీ భారత్​ కరోనాపై ఇచ్చిన ప్రధాన కథనాలు మీకోసం...

corona-news-in-telangana
కరోనాపై ఈటీవీ భారత్​ కథనాలు ఇవే...!

By

Published : Jun 8, 2020, 7:37 PM IST

Updated : Jun 8, 2020, 8:08 PM IST

కీలక​ సమీక్ష
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తీవ్రత, లాక్ డౌన్ అమలుపై చర్చలు జరుపుతున్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.పూర్తి కథనం కోసం... క్లిక్​ చేయండి.

హైకోర్టు ఆగ్రహం

ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. పూర్తి కథనం కోసం... క్లిక్​ చేయండి.

కరోనా​ జాడేది?

జీహెచ్​ఎంసీ సరిహద్దు జిల్లాల్లో కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. జనతా కర్ఫ్యూ తర్వాత 50 రోజుల వరకు ఒక్క కేసూ లేకుండా గ్రీన్​జోన్​లో ఉన్న యాదాద్రి జిల్లాలో సైతం ఇప్పుడు వరుస కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పూర్తి కథనం కోసం... క్లిక్​ చేయండి.

ప్రాణాలు పోతాయ్..

రాష్ట్రంలో కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో పర్యటించి.. పారిశుద్ధ్య పనులను మంత్రి పరిశీలించారు. పూర్తి కథనం కోసం... క్లిక్​ చేయండి.

సర్కాలు విఫలం..

కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. కొవిడ్​- 19 విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన కేసీఆర్​ సర్కారు... ఆ నెపం కేంద్రంపై నెడుతోందని మండిపడ్డారు. హెల్త్‌ బులిటెన్‌లో కూడా అరకొర సమాచారం ఉంటోందని... మరణాల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆక్షేపించారు. పూర్తి కథనం కోసం... క్లిక్​ చేయండి.

సచివాలయం, జీహెచ్​ఎంసీల్లో కరోనా కలకలం

సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్​లో కరోనా కలకలం రేగింది. ఏడో అంతస్తులో ఆర్థికశాఖలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ పొరుగుసేవల సిబ్బందికి పాజిటివ్ వచ్చిందన్న సమాచారం నేపథ్యంలో అధికారులు, సిబ్బంది హోంక్వారంటైన్​లోకి వెళ్లారు. మరోవైపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగికి కరోనా సోకింది. ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధరణతో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి కథనం కోసం... క్లిక్​ చేయండి.

నిమ్స్​లో గవర్నర్..

వైద్య సిబ్బందికి నైతిక మద్దతిచ్చేందుకే నిమ్స్​కు వచ్చానని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ తెలిపారు. హైదరాబాద్​ నిమ్స్​ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్​.. కరోనా బారిన పడిన వైద్యులు, సిబ్బందిని పరామర్శించారు. ఆందోళన చెందొద్దని.. మేమున్నామంటూ భరోసానిచ్చారు. పూర్తి కథనం కోసం... క్లిక్​ చేయండి.

Last Updated : Jun 8, 2020, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details