తెలంగాణ

telangana

ETV Bharat / state

బత్తిని పేరుతో నకిలీ మెడిసిన్..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇది అదునుగా చేసుకున్న ఓ ముఠా కొవిడ్​-19 వైరస్​కు ఔషధాలు ఉన్నాయంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం చేసింది. పలువురి నుంచి డబ్బులు సైతం వసూలు చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గుట్టు రట్టు చేశారు.

corona-is-a-gang-of-counterfeit-drugs-in-hyderabad
కరోనా నకిలీ ఔషదాల ముఠా దోరికిపోయింది

By

Published : Apr 16, 2020, 3:23 PM IST

కరోనా వైరస్ సోకకుండా ఔషధాలు ఉన్నాయంటూ ఆన్‌లైన్‌లో నకిలీ మందులు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేంద్రంగా

బత్తిని ఆయుర్వేదం పేరుతో ఆ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... రంగంలోకి దిగి నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్ష రూపాయల విలువైన నకిలీ ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఈ తరహా ముఠాల బారినపడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీవివాస్‌తో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి కె.శ్రీనివాస్ ముఖాముఖి.

ఇదీ చూడండి :మనమరాలికి కిడ్నీ సమస్య..యాచకుడిగా మారిన తాత

ABOUT THE AUTHOR

...view details