ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 20 వేల పైనే కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 92,231 నమూనాలను పరీక్షించగా.. 20,937 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,42,079కి చేరింది. తాజాగా 104 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 9,904కి పెరిగింది.
ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు... 104 మంది మృతి
ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో తాజాగా 104 మంది మృతి చెందారు.
ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ 20,811 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్ఛార్జి అయ్యారని, ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 క్రియాశీల కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. మహమ్మారి కారణంగా చిత్తూరులో అత్యధికంగా 15 మంది మృతి చెందగా.. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10 మంది, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:రఘురామకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు