కొవిడ్‌కు ముందు ఫాస్ట్ పుడ్ సెంటర్లు, బజ్జీల బండ్లు, పూలకొట్లు, ఛాయ్ దుకాణాలు కళకళలాడుతుండేవి. పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఈ పరిస్థితుల్లోనే కొవిడ్ మొదటి వేవ్ తర్వాత పరిస్థితి కొంతమేర కుదుటపడుతుందనుకున్న తరుణంలో రెండోవేవ్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. ఎక్కడ వైరస్ సోకుతుందనే భయంతో అత్యవసరమైతే అయితే తప్ప ప్రజలు పెద్దగా వస్తువులు కొనుగోలు చేయటం లేదు. దీంతో గిరాకీ లేక వీధి వ్యాపారులు అల్లాడుతున్నారు. కరోనా దెబ్బతో వ్యాపారాలు 70 శాతం పడిపోయాయని వాపోతున్నారు.
కర్ఫ్యూతో తీవ్ర నష్టం
కరోనా కారణంగా ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే... రాత్రి పూట కర్ఫ్యూతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని వీధి వ్యాపారులు వాపోతున్నారు. రాత్రి 8 గంటల తర్వాత గిరాకీ ఎక్కువగా ఉండేదని... ప్రస్తుతం ఆ సమయానికే దుకాణాలు మూసివేస్తుడటం వల్ల రోజువారీ ఖర్చులు మిగలట్లేదని తెలిపారు. అమ్మేందుకు తెచ్చిన సరుకు వీధిపాలవుతోందని... ఎంత కష్టపడినా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.