Corona Effect on Pneumonia Victims :న్యుమోనియా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల్లో కొవిడ్ బయటపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ 14 నెలల బాలుడికి న్యుమోనియా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా పరీక్షలు చేయగా, వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో వచ్చే పిల్లలందరికీ కరోనా పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో న్యుమోనియాతో 83 మంది పిల్లలు చికిత్స తీసుకుంటున్నారు. వీరందరికీ కొవిడ్ పరీక్షలు (Covid Tests in Telangana) చేయనున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపే ఉంటుండటంతో పిల్లలు, వృద్ధులు న్యుమోనియా బారిన పడుతున్నారు. సంవత్సరంలోపు పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. వైరల్ న్యుమోనియా 3-4 వారాల్లో తగ్గిపోతుంది. కరోనా వైరస్ వల్ల కూడా న్యుమోనియా సోకుతోందని, దీని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
'కరోనా న్యూ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలి - స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి'
అప్రమత్తత తప్పనిసరి :న్యుమోనియా సాధారణంగా రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిలోఫర్ ఆసుపత్రి (Nilofar Hospital) సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో చేరి ఎక్కువ కాలం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నవారిపై కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. న్యుమోనియాతో పాటు కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉషారాణి పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ జేఎన్ 1 వ్యాప్తి - 14కు చేరిన పాజిటివ్ కేసులు