corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా కేసులు నమోదు - telangana varthalu
19:32 June 09
రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,29,896 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో నిన్న కరోనాతో 17 మంది మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,426కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,801 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,301 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు