రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సోమవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో కేవలం 2 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1003కి చేరుకుంది. వైరస్ నుంచి కోలుకుని 16 మంది డిశ్ఛార్జి కావడం వల్ల కోలుకున్న వారి సంఖ్య 332కి చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాలుగా వనపర్తి, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ ఉన్నాయి.
కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు - కోవిడ్ -19 తాజా వార్తలు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం కొత్తగా కేవలం 2 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసులు 1003కి చేరాయి.
Corona cases are declining in the state
పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ చికిత్సలో ఎవరూ లేని జిల్లాల జాబితాలో సంగారెడ్డి, పెద్దపల్లి చేరాయి. ఈ జిల్లాల్లోని బాధితులు పూర్తిగా కోలుకుని.. సోమవారం డిశ్ఛార్జి అయ్యారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం 12 జిల్లాల్లో యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసుల్లేవని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.