తెలంగాణ

telangana

ETV Bharat / state

మానవత్వం మాయం: కరోనాతో మరణం... జేసీబీతో ఖననం

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా రోగి మృతదేహాన్ని జేసీబీ సాయంతో తీసుకెళ్లి ఖననం చేశారు.

tirupati corona dead body
మానవత్వం మాయం: కరోనాతో మరణం... జేసీబీతో ఖననం

By

Published : Jul 6, 2020, 5:24 PM IST

ఆంధ్రప్రదేశ్​ శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగి మృతదేహాన్ని జేసీబీ తొట్టెలో శ్మశానానికి తీసుకెళ్లిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. కరోనా వైరస్​ సోకి కన్నుమూసిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీ సాయంతో ఖననం చేశారు అధికారులు. ఈ ఘటన స్థానిక హరిశ్చంద్ర వాటికలో జరిగింది.

కరోనా రోగి మృతదేహాన్ని అంబులెన్సులో శ్మశాన వాటికకు తీసుకొచ్చిన వైద్య సిబ్బంది... అనంతరం జేసీబీ సాయంతో ఖననం చేశారు. వైద్య సిబ్బంది తీరు వివాదాస్పదమైంది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో ఇలా వ్యవహరించడమేంటని కొందరు విమర్శిస్తున్నారు. అయితే మృతుడి బరువు 155 కిలోలు ఉన్నందునే జేసీబీ సాయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

మానవత్వం మాయం: కరోనాతో మరణం... జేసీబీతో ఖననం

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details