Consumer Win 16 Year of Land Case in Hyderabad :ఈ మధ్య కాలంలో ఆన్లైన్ కొనుగోలు(Online Frauds), ఆన్లైన్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే అదనుగా భావించి.. మోసగాళ్లు నేరాళ్లకు పాల్పడిన సందర్భాలు అనేకం. ఇక ఆఫ్లైన్లోనూ అంటే దుకాణాల్లో, షాపింగ్ మాల్స్‌లో.. ఇతరుల వద్ద ప్రత్యక్షంగా మోసపోతున్న వారెందరో. ఒక వస్తువును కొన్నప్పుడు నష్టపోయామని గ్రహించినా.. వ్యవహారమేదైనా.. మోసపోయామని భావించినా ఇక చింతపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వినియోగదారుల కమిషన్(Telangana State Consumer Commission) ఎప్పుడు వినియోగదారుడికి అండగా ఉంటుంది.
land fight in Consumer Court at Hyderabad :ప్రతి రాష్ట్రంలోనూ వినియోగదారుల కమిషన్ అందుబాటులో ఉంటుంది. తాజాగా 16 ఏళ్ల క్రితం జరిగిన కేసులో ఇప్పుడు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పును వెలువరించింది. ఆ కేసులో స్థలాన్ని అభివృద్ధి చేసి అప్పగిస్తామంటూ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఈ కమిషన్ ఏకంగా ఓ రియల్టర్ కంపెనీకి రూ.37.70 లక్షల జరిమానా విధించింది. అంతే కాదండోయ్ అతణ్ని 16 ఏళ్లుగా మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు కూడా మూల్యం చెల్లించుకునేలా చేసింది.
వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌కు చెందిన ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు కర్ణాటకలో వివేకానంద కుమార్, దాసరి శ్రీనాథరావు, సుధాకర్‌రెడ్డిలకు చెందిన వీఈజీఈ రియల్టర్స్ సంస్థ వద్ద కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. అందుకు ఆ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి విడతల వారీగా రూ.37.70 లక్షలను వారికి మూడు విడతలుగా చెల్లించారు. స్థలాన్ని అభివృద్ధి చేయడానికి ఆ సంస్థతో 2007 ఏప్రిల్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ సంస్థ ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో.. శ్రీనివాసరావు తెలంగాణ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
క్యారీ బ్యాగ్‌కు డబ్బులు వసూలు చేసిన 'స్పెన్సర్'.. షాకిచ్చిన కస్టమర్