Constable Exam New Date: రాష్ట్రంలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీని మారుస్తున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ నెల 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 28న నిర్వహించాలని నిర్ణయించింది. సాంకేతిక కారణాల వల్ల తేదీని మార్చినట్లు నియామక బోర్డు వెల్లడించింది. ఆదివారం ఎస్సై రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
Constable Exam New Date: కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు - కానిస్టేబుల్ తాజా వార్తలు
17:28 August 08
Constable Exam New Date: ఈనెల 28న కానిస్టేబుల్ రాత పరీక్ష
మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ జారీ అయింది. కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నియామక బోర్డు అధికారులు గతంలోనే తెలిపారు.
ఇవీ చదవండి:'త్వరలో తెరాస పార్టీలో బాంబ్ బ్లాస్ట్'
'సభలో సింహం'.. వెంకయ్యపై ప్రశంసల జల్లు.. ఎంపీల స్పెషల్ రిక్వెస్ట్