ETV Bharat / state
భర్త వేధింపులకు ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య - sucide
పెళ్లై ఏడాది కాలేదు. భర్త వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్యహత్య చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీలత... పనిలో చూపించిన ఆత్మస్థైర్యాన్ని జీవితంలో చూపించలేక తనువు చాలించింది.
ఆత్మహత్య చేసుకున్న శ్రీలత
By
Published : Apr 4, 2019, 10:23 AM IST
| Updated : Apr 4, 2019, 11:09 AM IST
ఆత్మహత్య చేసుకున్న శ్రీలత హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది. కవాడిగూడలోని గాంధీనగర్ ఔట్‌పోస్టు కార్యాలయ సమీపంలో ఉంటుంది. పది నెలల క్రితమే సింగరేణి కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనరసింహతో వివాహం జరిగింది. అప్పటినుంచి నరసింహ భార్యపై అనుమానం పడేవాడు. తీవ్ర మానసిక ఆందోళనకు గురైన శ్రీలత ఇంట్లో కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Last Updated : Apr 4, 2019, 11:09 AM IST