Congress Vijayabheri Sabha Arrangements తుక్కుగూడలో విజయభేరి సభకు భారీ ఎత్తున కాంగ్రెస్ కసరత్తు Congress Vijayabheri Sabha Arrangements in Tukkuguda :కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలు హాజరు కానున్న తుక్కుగూడ విజయభేరి సభ (Congress Vijayabheri Sabha) నిర్వహణను..రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 17 సాయంత్రం జరగనున్న సభను విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలు ఈనెల 16న తాజ్ కృష్ణాలో జరగనున్నాయి. ఈనెల 17న నిర్వహించనున్న విజయభేరి సభకు అగ్రనాయకులంతా హాజరు అవుతారని హస్తం వర్గాలు వెల్లడించాయి.
KC Venugopal on Telangana Assembly Elections 2023 : 'ఈసారి అధికారంలోకి రాబోతున్నాం.. సమన్వయంతో పని చేయండి'
Congress Vijayabheri Sabha 2023 : నగర శివారులో వంద ఎకరాలకు పైగా ఖాళీ స్థలంలో నిర్వహించనున్న ఈ సభకు... భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా మూడు రోజులపాటు స్థానిక నాయకత్వంతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశాలు నిర్వహించి పోలింగ్ కేంద్రాల వారీగా.. పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇవాళ, రేపు కూడా నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించనున్న ఏఐసీసీ పరిశీలకులు (AICC Observers).. స్థానిక నాయకుల సహకారంతో ఎంత మంది సభకు తరలివస్తారన్న దానిపై పీసీసీకి నివేదిక ఇస్తారు. అయితే హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలించాలని భావిస్తున్నారు.
Congress Screening Committee Meeting : 'అభ్యర్థుల జాబితా ఇప్పుడే తేల్చలేం.. మరోసారి భేటీ అయ్యాక చెబుతాం'
CWC Meetings in Hyderabad on September 16th : తుక్కుగూడ సభకు హాజరయ్యే ముందు.. సికింద్రాబాద్లోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో నిర్మాణాలకు సోనియాగాంధీ (SoniaGandhi Hyderabad Tour )శంకుస్థాపన చేస్తారు. పది ఎకరాలకుపైగా ఉన్నఈ విస్తీర్ణంలో.. ఏకకాలంలో నాలుగు వందల మంది నివాసం ఉండేట్లు వన్ ప్లస్ టూ తరహాలో భవనాలు నిర్మిస్తారు. రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చే విధంగా.. నిర్మాణాలు యు ఆకారంలో ఉంటాయని పీసీసీ వర్గాలు తెలిపాయి.
Congress to Announced Five Guarantees in Telangana :ప్రతి భవనం ముందుకు వాహనం వెళ్లేందుకు బిల్డింగ్ నిర్మాణ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సోనియాగాంధీ తుక్కుగూడకు చేరుకుని 5 గ్యారంటీలను (Congress to Announced Five Guarantees) ప్రకటిస్తారు. మేనిఫెస్టో, డిక్లరేషన్లల్లో పొందుపరచిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఐదు అంశాలను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఇదే సభలో చేరికలు కూడా ఉంటాయని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే దాదాపు పది మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని...ఆ రోజుకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర భవిష్యత్ మార్చేలా సభ నిర్వహిస్తామని.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
"ఈనెల 17న జరిగే కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలి. ప్రతి 5 నియోజకవర్గాలకు ఒక సీనియర్ నాయకుడిని బాధ్యుడిగా నియమించాం. ప్రభుత్వ తప్పిదాలను ఛార్జిషీట్ రూపంలో ప్రకటిస్తాం. ఈనెల 18న అన్ని నియోజకవర్గాల్లోసీడబ్ల్యూసీ సభ్యులు పర్యటిస్తారు. సీడబ్ల్యూసీ సభ్యులు 5 హామీల గ్యారంటీ కార్డును అందరికి అందిస్తారు. ఈ సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాను."- భట్టి విక్రమార్క, సీఎల్పీనేత
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను.. పీసీసీ అధ్యక్షుడురేవంత్ రెడ్డి సీనియర్లకు అప్పగించారు. తిరగబడదాం-తరిమికొడదాం అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించారు. ప్రతి అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక నాయకుడిని లెక్కన 119 నియోజక వర్గాలకు బాధ్యులను నియమించారు.
Congress CWC Meeting Arrangements in Telangana : 'ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజయభేరి సభను ఆపలేరు'
Congress Left Parties Alliance Telangana : వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు చిక్కు.. సీట్ల విషయంలో తేలని లెక్క