ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు తెరాస, భాజపా ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మతం ముసుగులో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
మతం ముసుగులో ప్రజలను రెచ్చగొడుతున్నారు : వీహెచ్ - వీహెచ్
గ్రేటర్ ఎన్నికల్లో మతం పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఘర్షణలు సృష్టించేందుకు భాజపా, తెరాస ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
మతం ముసుగులో ప్రజలను రెచ్చగొడుతున్నారు : వీహెచ్
నగరంలో ఎక్కడా చూసినా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. ఎంఐఎం నాయకులు ముస్లింలకు ఏం చేశారో చెప్పాలన్నారు. మహరాష్ట్ర, బిహార్‌కు వెళ్లి ఎవరికి లాభం చేశారో అసదుద్దీన్ ఆలోచించుకోవాలన్నారు. తాము చేసిన తప్పిదం వల్లనే దుబ్బాకలో భాజపా గెలిచిందన్నారు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని బండి సంజయ్ చూస్తున్నారని వీహెచ్ ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి:కాంగ్రెస్ ముమ్మర ప్రచారం.. నేటి నుంచి రంగంలోకి సీనియర్లు