తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్‌ బంద్‌కు తెలుగు రాష్ట్రాలు మద్దతివ్వాలి: వీహెచ్ - భారత్‌ బంద్‌కు మద్దతివ్వాలని కోరిన వీహెచ్

రైతు సంఘాలు చేపడుతున్న రేపటి భారత్‌ బంద్‌కు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతివ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ కోరారు. నాలుగు నెలలుగా కర్షకులు దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్నా.. కేంద్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

congress leader vh
vh on bandh

By

Published : Mar 25, 2021, 7:52 PM IST

దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు మేలు చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు విమర్శించారు. రేపు జరగనున్న భారత్‌ బంద్‌కు తెలుగురాష్ట్రాలు మద్దతివ్వాలని ఆయన కోరారు. నాలుగు నెలలుగా దిల్లీ సరిహద్దులో రైతులు పోరాటం చేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని అందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.

అన్ని వర్గాలు బంద్‌లో పాల్గొని భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. తెరాస ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లతో నిరసన చేస్తున్న రైతులకు అండగా అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గతంలో రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చిన తెరాస.. ఆ తర్వాత వెనక్కి తగ్గిందని... రేపటి బంద్‌తో ఈ విషయం బహిర్గతమవుతుందని వీహెచ్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం... కాల్​రికార్డింగ్​ వైరల్​..

ABOUT THE AUTHOR

...view details