హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్‌లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అంబర్ పేటలోని తన నివాసం వద్ద వీహెచ్ దీక్ష చేస్తున్నారు. రెండేళ్ల క్రితం అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు తాను ప్రయత్నించగా... పోలీసులు ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని తనపై కేసులు నమోదు చేశారన్నారు.
వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష... కారణం అదే - కాంగ్రెస్ వార్తలు
పంజాగుట్ట సర్కిల్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు వీహెచ్ డిమాండ్ చేస్తూ... ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అంబర్‌పేటలోని తన నివాసం వద్ద దీక్షకు దిగిన వీహెచ్... ప్రభుత్వం స్పందించే వరకూ నిరసన కొనసాగిస్తానని వెల్లడించారు.
వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష... కారణం అదే
విగ్రహాన్ని గోషామహల్ స్టేడియంలో ఉంచారని... దానిని తనకు అప్పగించాలని, పంజాగుట్ట కూడలిలో ఏర్పాటుకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునేవరకు వరకూ... తన దీక్ష కొనసాగుతుందని వీహెచ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:భార్యను హతమార్చిన భర్త.. విచారణలో షాకింగ్ విషయాలు!