కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇచ్చే ధ్రువ పత్రంపై తక్షణమే నరేంద్ర మోదీ బొమ్మను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేసిన అధికారులపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహరిన్నాయన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న మత, కుల రాజకీయాలపై హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశారు.
'ధ్రువపత్రంపై మోదీ బొమ్మను తొలగించండి'
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇస్తున్న ధ్రువపత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
తెరాస మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, హరీశ్ రావు, ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి చేస్తున్న ఎన్నికల ప్రచారంపై ఎస్ఈసీకి వివరించారు. ఎప్పుడూ లేని విధంగా మత, కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెరాసకే ఓటు వేయాలనే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై మంత్రులు ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన అధికారులపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారిపై కేసులు నమోదు చేసి ఎన్నికల సంఘం తన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరముందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.
ఇదీ చూడండి:దిశ ఘటన తర్వాత స్పందన ఎలా ఉందో చూశారు :కేటీఆర్
TAGGED:
telangana news