సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని అసైన్డ్ భూములపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదల భూములు కావడంతోనే అన్యాక్రాంతామైనట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని అసైన్డ్ భూములపై విచారణ చేయాలి: జీవన్ రెడ్డి
ఈటల రాజేందర్‌ను దోషిగా చూపేందుకే అసైన్డ్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అన్నీ భూములపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
2018లో తీసుకొచ్చిన నూతన పట్టాదారు విధానంతో అసైన్డ్ భూముల మార్పిడి చేశారని ఆరోపించారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై కమిటీ వేస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు లేదన్నారు. ప్రభుత్వం అసైన్డ్ భూములను గుర్తించి.... అసలైన పట్టాదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవరయంజాల్‌తో పాటు రాష్ట్రంలోని అన్నీ దేవాలయ భూములన్నింటిపై విచారణ జరిపించాలని కోరారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు జ్యూడీషీయరీ అధికారాలు కల్పించాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని అసైన్డ్ భూములపై విచారణ జరిపించాలి. అచ్చంపేట్, హకీంపేట్, హాఫీజ్‌పేట్, కోకాపేట్, నయీం భూములపై దర్యాప్తు చేయాలి. ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ ఏర్పడ్డాకే ఎక్కువ భూములు అన్యాక్రాంతమయ్యాయి. వక్ఫ్ బోర్డుకు జ్యూడీషియరీ అధికారాలు కల్పించాలి.- జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ