అసెంబ్లీ సమావేశాలకు హస్తం నేతలు నల్ల కండువాలతో హాజరై నిరసన తెలిపారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాస పార్టీలో కలుపుకోవడంపై ఆందోళన చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అంతకు మునుపు అసెంబ్లీలోని భట్టి విక్రమార్క ఛాంబర్లో సమావేశమైన హస్తం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం నిరసనలకు దూరంగా ఉన్నారు.
అసెంబ్లీలో నల్ల కండువాలతో కాంగ్రెస్ నిరసన - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ నేతలు నల్ల కండువాలతో హాజరయ్యారు. 12 మంది హస్తం ఎమ్మెల్యేలను తెరాసలో కలుపుకోవడంపై నిరసన తెలిపారు. అంతకు మునుపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఛాంబర్లో సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
కాంగ్రెస్ నిరసన