రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఇప్పటికైనా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే జూనియర్ కళాశాలలో అధ్యాపకుల పోస్టులను కూడా భర్తీ చేయాలన్నారు. విష జ్వరాలను కూడా ఆరోగ్య శ్రీ పథకంలోకి చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లు నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు.
విష జ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: శ్రీధర్ బాబు
విష జ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్ శాసనసభ్యుడు శ్రీధర్ బాబు కోరారు. ఆరేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వేయకుండా విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారని అసెంబ్లీలో ఆయన ప్రశ్నించారు.
assembly