రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించలేదన్న తెరాస నేత హరీశ్‌రావు వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. భాగ్యనగర వాసుల దాహార్తి తీర్చేందుకు కాంగ్రెస్ హయాంలోనే సింగూరు, మంజీరా జలాశయాల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం వల్లే ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా హరీశ్‌రావు అసత్యాలు మానాలని హితవు పలికారు.
'కాంగ్రెస్ హయాంలోనే ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం' - సాగునీటి ప్రాజెక్టులు
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పుపట్టారు. ప్రధాన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించనవేనని తెలిపారు. హరీశ్ రావు ఇకనైనా అసత్యాలు మానాలని హితబోధ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి