కోర్టుకు హాజరు కావాల్సి ఉండడం వల్లనే తాను భూపాలపల్లి సభకు హాజరు కాలేకపోతున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(pcc working president jaggareddy) తెలిపారు. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(tpcc chief revanth reddy)కి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్‌బాబుకు కూడా సమాచారం ఇచ్చినట్లు వివరించారు. ఈ సాయంత్రం భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వివరించారు. ఆ సమావేశానికి రావాలని తనకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సత్యనారాయణ రావు ఫోన్ చేశారని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉంటుందని.. దానికి తాను ఇంఛార్జినని పేర్కొన్న జగ్గారెడ్డి.. ఒక కేసులో మధ్యాహ్నం 2 గంటలకు కోర్టుకు హాజరుకావాల్సి ఉండడం, తప్పనిసరి కావడం వల్ల భూపాలపల్లికి రాలేకపోతున్నట్లు వివరించారు. తాను ఎందుకు హజరు కాలేదని మీడియాలో వేరే సంకేతాలు వెళ్లకుండా ఉండేందుకే ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు వివరించారు.
ఇటీవల జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్న్‌మెంట్ కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేకపోవడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ జిల్లా ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు(jaggareddy and revanth reddy controversy). తనకు సమాచారం లేకుండా నియోజకవర్గానికి వెళ్లడంతో, పీసీసీ అధ్యక్షుడికి తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు పరోక్షంగా పీసీసీ(tpcc) చెప్పాలనుకున్నారా? అని మీడియా ముందు జగ్గారెడ్డి నిలదీశారు. దీంతో అప్రమత్తమైన ఏఐసీసీ.... నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మీడియా ముందుకు వెళ్లడం సరికాదని తీవ్రంగా స్పందించిన అధిష్ఠానం... రాష్ట్ర ఇంఛార్జి, ఏఐసీసీ కార్యదర్శుల ద్వారా విషయాన్ని ఆరా తీసింది. ఈ నేపథ్యంలో ఆయన సభకు హాజరు కాకపోవడం కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.