తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టుపై జగ్గారెడ్డి ప్రశంసలు

తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై సీనియర్​ కాంగ్రెస్​ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే...  కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం ప్రశంసలు కురిపించారు. ఈ విషయంలో తెరాస వాదనతో సంపూర్ణంగా ఏకీభవించారు.

By

Published : Jun 19, 2019, 4:46 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై జగ్గారెడ్డి ప్రశంసలు

కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో జగ్గారెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు తీరతాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం ఎవరి హయాంలో జరిగినా హర్షించాల్సిందే అన్నారు. కాళేశ్వరంలో అవినీతి గురించి తనకు తెలియదన్న జగ్గారెడ్డి....ఆ విషయం సీల్పీ నాయకుడు భట్టి చూసుకుంటారని పేర్కొన్నారు.

అవి నింపితే కేసీఆర్​ను సన్మానిస్తా...

నాగార్జునసాగర్, శ్రీరామ్‌సాగర్, సింగూర్, మంజీరా లాంటి ప్రాజెక్టులను కట్టిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. ఏ సీఎం ప్రాజెక్టులు నిర్మించినా ప్రజలు.. రైతుల కోసమే అన్నారు జగ్గారెడ్డి. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వబట్టే... కాళేశ్వరం కట్టగలిగామన్నారు. ఈ ఏడాదిలోనే కాల్వలు తవ్వి సింగూరు, మంజీరాలను నింపాలని కోరారు. సింగూరు, మంజీరాలను నింపితే ప్రజల పక్షాన కేసీఆర్‌ను సన్మానిస్తానని తెలిపారు. కాళేశ్వరం ప్రారంభానికి జగన్‌, ఫడణవీస్‌ను పిలవడంలో తప్పులేదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.

ఇవీచూడండి: తెలంగాణలో పాతాళంలోకి భూగర్భజలాలు

ABOUT THE AUTHOR

...view details